శ్రీకాళహస్తిలోని ఇసుకగుంటలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కులదీప్ (20) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్లుగా భార్యతో కలిసి ఇక్కడ పీఓపీ పనులు చేసుకుంటున్న కులదీప్ వద్దకు రెండు నెలల క్రితం అతని తమ్ముడు ప్రదీప్ వచ్చాడు. బుధవారం రాత్రి స్వగ్రామానికి వెళ్లాలని ప్రదీప్ అన్నతో గొడవపడగా, నాలుగు రోజుల తర్వాత వెళ్దామని కులదీప్ చెప్పాడు. అయితే, ఉదయానికల్లా ప్రదీప్ ఉరేసుకుని మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు ఈ సంఘటన చోటు చేసుకుంది.