వైయస్సార్ పార్టీ నాయకుడు తండ్రికి ఘనంగా నివాళులు

శ్రీకాళహస్తి రేణిగుంట టౌన్ 6వ వార్డు ఎంపీటీసీ సుందర మూర్తి తండ్రి దుర్గాచలం ఆకస్మిక మృతి చెందారు. ఈ నేపథ్యంలో, నేడు వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ అధ్యక్షులు ప్రభాకర్, జాన్ బాబు, లోహినాథ్, ఇంబనాథన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్