అంగన్‌వాడీలో ఉక్కపోత: పిల్లల ఇక్కట్లు, అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆందోళన

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మంగా నెల్లూరులో అంగన్‌వాడీ కేంద్రం మరమ్మతుల కారణంగా కమ్యూనిటీ భవనంలో కొనసాగుతోంది. అయితే, ఆ భవనంలో పంకాలు పనిచేయకపోవడంతో చిన్నారులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి లేకపోవడంతో పిల్లలు తరగతులపై దృష్టి పెట్టలేకపోతున్నారు. వేడిమి కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్