ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్

సులూరుపేట నియోజకవర్గ నాయుడుపేటలో పోలీసులు ట్రాన్స్ ఫార్మర్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 6 మంది నిందితులు, 2 బాలురను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 4.20 లక్షల విలువైన రాగిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా జిల్లాలో 35 ట్రాన్స్ ఫార్మర్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రైతులను లక్ష్యంగా చేసుకునే నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్