నాయుడుపేట: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి

నాయుడుపేట మండలంలోని కారుమంచివారి కండ్రిగ గ్రామంలో పిడుగుపాటుకు తోప్పని యశ్వంత్ (22) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడిన యశ్వంత్ను వెంటనే నాయుడుపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్