సూళ్లూరుపేట: బివి పాలెంలో సందర్శకుల కోలాహలం

తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువన్షితో కలిసి శనివారం తడ మండలం బీవీ పాలెం పడవల రేవును సందర్శించారు. 2026లో జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం సందర్శకులకు అన్ని వసతులతో పాటు ప్రత్యేక బోటు సౌకర్యం, ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తాగునీరు, టాయిలెట్లు వంటి అన్ని సౌకర్యాలు కల్పించామని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్