తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో ఓజిలి మండలంలోని వజ్జావారిపాళెం, అత్తివరం పీహెచ్‌సీలలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు గురువారం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పింక్ బస్సుల ద్వారా స్క్రీనింగ్ చేపట్టారు. బిపి, షుగర్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. పురుషులు, మహిళలు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.