శ్రీహరికోట ఎస్‌డీఎస్‌సీ షార్‌కు నూతన డైరెక్టర్‌గా ఇ. ఎస్. పద్మకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇస్రోలో 1986లో చేరిన ఆయన పీఎస్‌ఎల్‌వి, జీఎస్‌ఎల్‌వి, ఎల్వీఎం3, మంగళయాన్, చంద్రయాన్, ఆదిత్య-ఎల్1 ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. ఐఐఎస్సీ బెంగళూరులో మాస్టర్స్ పూర్తి చేశారు. ఐస్రో నుంచి రెండు టీం అవార్డులు, ఒక మెరిట్ అవార్డు అందుకున్నారు. షార్ శాస్త్రవేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.