సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు హైస్కూల్ నుంచి శివాలయానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై మురుగు నీరు నిల్వ ఉండటంతో శివాలయానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని బావిలోకి మురుగు నీరు చేరడంతో తాగునీరు కలుషితమవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మురుగును తొలగించి, రహదారిని మరమ్మతు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.