సూళ్లూరుపేట: లైంగిక వేధింపులపై వాకాడు తహసీల్దార్ సస్పెన్షన్

వాకాడు మండల తహసీల్దార్ రామయ్యను, విఆర్వోగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సస్పెండ్ చేశారు. ఏడాది కాలంగా ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజుల ద్వారా వేధింపులకు గురైన మహిళా విఆర్వో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపి ఆరోపణలు నిజమని తేలడంతో గురువారం చర్యలు తీసుకున్నారు. విచారణాధికారిగా ఎస్డీసీ రోజ్‌మాండ్‌ను నియమించారు.

సంబంధిత పోస్ట్