సూళ్లూరుపేట: వ్యవసాయశాఖ కార్యాలయంలో దొంగతనం కలకలం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం దొంగతనం జరిగింది. కార్యాలయ సిబ్బంది ఉదయం విధులకు హాజరవ్వగా, తలుపులు బద్దలు కొట్టి, బీరువా తెరిచి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. కీలక పత్రాలు, పరికరాలు ఉన్నప్పటికీ ఎటువంటి వస్తువులు దొంగిలించబడలేదని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్