ఈరోజు ఉదయం 6:20 గంటలకు సులూరుపేట నియోజకవర్గ తడ మండలంలో, తడ రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు రైలు పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు ఢీకొని 65-70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. చెన్నై నుండి సూళ్లూరుపేట వస్తున్న లోకల్ ట్రైన్ (నెం. 42401) డ్రైవర్ స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించగా, ఆయన సూళ్లూరుపేట జీఆర్పీ పోలీసులకు తెలియజేశారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని సూళ్లూరుపేట తరలించారు.