VIDEO: సూళ్లూరుపేటలో యువకులపై దాడి

ఆదివారం రాత్రి సూళ్లూరుపేట మండలం కుదిరి గ్రామానికి చెందిన బస్వంతు, నాగేంద్రలపై థియేటర్‌లో పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు కొందరు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ అజయ్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మత్తులోనే దాడి జరిగిందనే ఆరోపణలున్నాయి.

సంబంధిత పోస్ట్