సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో 10 క్లస్టర్లలో వర్చువల్ మహానాడు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి, ప్రజలకు సేవ చేయడానికి కార్యకర్తల పాత్ర కీలకమని ఆమె నొక్కి చెప్పారు.