రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత కేఈఈ, నీట్, ఈఏపీసెట్ శిక్షణ కార్యక్రమానికి ములకలచెరువు ఆదర్శపాఠశాల నుండి 8 మంది విద్యార్థులు ఆన్లైన్ స్కానింగ్ టెస్ట్ ద్వారా ఎంపికయ్యారు. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు శాంతి పురం మోడల్ స్కూల్ సెంటర్లో ఈ శిక్షణ అందించబడుతుంది. విద్యార్థులకు పోషకాహారం, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నాణ్యమైన కోచింగ్, స్టడీ మెటీరియల్ అందిస్తారు. రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఉచిత శిక్షణ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రిన్సిపల్ పి. కవిత తెలిపారు.