కోటకొండలో ముగిసిన నట్టల నివారణ మందుల పంపిణీ

తంబళ్లపల్లి మండలం కోటకొండ గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ విజయవంతంగా ముగిసింది. గ్రామంలో 7000గొర్రెలకు 1100 మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు హేమాపతి రెడ్డి గురువారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది గొర్రె మేకలు నట్టల బారి నుండి రక్షణ లభించిందని పాడి రైతులు తెలిపారు. పశుసంపద పరిరక్షణలో ఈ పంపిణీ కీలక పాత్ర పోషించిందని పశుసంవర్ధక శాఖ ఏ డి సుమిత్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్