మొలకలచెరువు: ఘనంగా జనాభా నియంత్రణ దినోత్సవం

మొలకలచెరువు మండల ఆసుపత్రి వైద్యాధికారి జాహ్నవి రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైద్యురాలు మాట్లాడుతూ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జన బనియన్ కోసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమె ఆరోగ్య సిబ్బందితో కలసి ఫ్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ జనాభా పెరుగుదల వలన కలిగే నష్టాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులైన దంపతులు కుటుంబ నియంత్రణకు కట్టుబడి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్