ములకలచెరువు మండలంలోని బురకాయలకోటలో శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఈపెన్షన్ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఆజాద్, టీడీపీ నాయకులు పి. విజయ్ కుమార్, ముత్తుకూరి మౌలా, ఎన్. మౌలా, బంగారు బాబు, టీ. వలి, హైస్కూల్ మాజీ ఉద్యోగి హైదర్ వల్లి, బీజేపీ కౌతాళం తదితరులు పాల్గొన్నారు.