పీటీఎం శివాలయంలో ఘనంగా శాకంబరీ ఉత్సవ వేడుకలు

పీటీఎంలోని శివాలయంలో ఆషాడ మాసంలో భాగంగా పార్వతి దేవి లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి అమ్మవార్లకు శుక్రవారం రాత్రి శాకంబరీ మాత అలంకరణ చేశారు. ఆలయ సేవకులు సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో వేద పండితులచే అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ఫలాలతో శాకంబ్రిరిదేవిగా ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో మంత్రోచ్చారణ నడుమ విశేష విశేషాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్