ఇటీవల మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 14 మంది మరణించడంతో, తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శుక్రవారం రాత్రి బస్టాండ్ వద్ద SP సుబ్బరాయుడు, RTO మురళీమోహన్ ఆదేశాల మేరకు అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. MVIలు అథికా నాజ్, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, లావణ్య, పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొని, సంబంధిత వివరాలపై ఆరా తీశారు.