ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికి, దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈవో, అదనపు ఈవోలు గవర్నర్‌కు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.