తిరుమలకు చేరుకున్న ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్

రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి సమీపంలోని శ్రీభాగ్య అతిథి భవనం వద్ద టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితర అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్‌కు అక్కడే బస ఏర్పాట్లు చేశారు. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆయన దర్శనాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్