కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీలో ఉన్న ఇతర మతాలకు చెందిన ఉద్యోగులను వెంటనే తొలగించాలని, అటువంటి వారిని కొనసాగించరాదని తెలిపారు. పురాతన దేవాలయాలను గుర్తించి నిధులు కేటాయించాలని, కొండగట్టు, వేములవాడ, ఇల్లందు రామాలయాలకు టీటీడీ సహకారం అందించాలని కోరారు. టీటీడీని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడకూడదని స్పష్టం చేశారు.