తిరుపతి నగరంలో దొంగతనాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు టీఎన్ఆర్ కళ్యాణమండపం వెనుక అష్టలక్ష్మి ఆలయం వద్ద పార్క్ చేసిన బైకును ఇద్దరు వ్యక్తులు నిమిషాల వ్యవధిలో దొంగిలించారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇటీవల కొర్లగుంట ప్రాంతంలో కూడా వరుసగా బైక్ చోరీలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.