తిరుమల హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. శనివారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ టీటీడీలో అన్యమత ప్రచారం చేస్తున్న ఉద్యోగులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయనను విమర్శించారు.