తిరుపతిలో హోటల్ కు బాంబు బెదిరింపు

తిరుపతి రాజ్‌పార్క్ లో ఓ హోటల్‌కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం సృష్టించింది. హోటల్‌లో బాంబు పెట్టామని, కాసేపట్లో పేలిపోతుందని వచ్చిన మెయిల్‌తో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్‌ హోటల్‌లోని గదులు, బాత్‌రూములను అంగుళం అంగుళం పరిశీలిస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వరుసగా రావడం ఆందోళన కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు పర్యటన సమయంలో కూడా బెదిరింపు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. తాజాగా మళ్లీ ఇలాంటి మెయిల్ రావడం చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్