తొలిదశలో గుర్తిస్తే క్యాన్సర్‌కు పూర్తి నయం సాధ్యం

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన వాకథాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ క్యాన్సర్‌పై అనవసరమైన భయాన్ని వీడి ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తొలిదశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే పూర్తిస్థాయి నయం సాధ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్