తిరుమలలో వైభవంగా చక్రతీర్థ ముక్కోటి వేడుకలు

తిరుమలలో మంగళవారం చక్రతీర్థ ముక్కోటి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీచక్రత్తాళ్వారు, నరసింహస్వామి, ఆంజనేయస్వామికి అభిషేకం, పుష్పాలంకరణ చేసి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి వేడుకలను ముగించారు.

సంబంధిత పోస్ట్