తిరుపతి జిల్లా వ్యాప్తంగా అంగళ్లలో తనిఖీలు.. 191 కేసులు నమోదు

తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో 3రోజులుగా ఈగిల్ టీం, పోలీసు సిబ్బంది కలిసి తిరుపతి, రేణిగుంట, పుత్తూరు, శ్రీకాళహస్తి తదితర సబ్ డివిజన్లలో స్కూల్, కాలేజీల వద్ద ఉన్న అంగళ్లలో తనిఖీలు చేపట్టారు. కొన్ని అంగళ్లలో గుట్కా, సిగరెట్లు విక్రయించినట్లు గుర్తించి 191కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ. 200ఫైన్ విధించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అంగళ్ల నిర్వహకులను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్