తిరుపతి–కరకంబాడి రోడ్డుపై వీధిదీపాలు పని చేయక చీకట్లో ప్రమాదాలు జరుగుతున్నాయని వైసీపీ నేత భూమన అభినయ్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు శనివారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. వీవీఐపీలు, భక్తులు ప్రయాణించే ప్రధానమార్గంలో ఏడాదిగా దీపాలు వెలగకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుపట్టారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెలుగు అందరికీ, కేవలం వీఐపీలకే కాదు అంటూ నిరసన తెలిపారు.