తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం నాగలాపురం, సత్యవేడు మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సురుటుపల్లిలో శ్రీ వినాయక స్వామి వారి కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొని, అనంతరం సత్యవేడు లో నూతన అన్నా క్యాంటీన్‌కు భూమి పూజ చేస్తారు. అనంతరం "సూపరిపాలన తొలి అడుగు" కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా పాల్గొననున్నారు.