తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై విభాగాలవారిగా అధికారులతో టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఎస్ఎస్‌డీ కౌంటర్ల నిర్వహణ, అన్నప్రసాదం విభాగం ఆధునీకరణ, పరకామణి నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి అంశాలపై వివరంగా ఈఓ సమీక్షించారు.