తిరుమల ఘాట్‌రోడ్డులో కూలిన చెట్లు.. ట్రాఫిక్‌కు అంతరాయం

తిరుమల ఘాట్‌రోడ్డులో బలమైన గాలుల కారణంగా చెట్టు కొమ్మలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. గత రెండు రోజులుగా ఈదురుగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. సమాచారం అందిన వెంటనే టీటీడీ అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చెట్లను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్