తిరుమల దర్శనం టికెట్ల పేరుతో మోసం

తిరుమల దర్శన టికెట్ల పేరిట శుక్రవారం మోసం జరిగింది. టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేరును ఉపయోగించి ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. వీఐపీ బ్రేక్ దర్శనం, సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ వంశీ అనే వ్యక్తి ఒక్కొక్కరినుంచి రూ. 50వేలు వసూలు చేశాడు. విషయం తెలిసిన వెంటనే జగ్గంపేట ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్