తిరుమలలో ప్రత్యేక దర్శనం కల్పిస్తానని నమ్మించి, ఒక మహిళ నుంచి రూ. 36 వేలు వసూలు చేసి నకిలీ సిఫార్సు లెటర్లు పంపిన చాగంటి నవీన్ కుమార్ అనే వ్యక్తిని తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని పట్టుకుని నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దర్శనాల కోసం భక్తులు అధికారిక మార్గాలనే వినియోగించాలని పోలీసులు సూచించారు.