తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో ఆదివారం రాత్రి మాఘ శుద్ధ పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్