గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో గల శ్రీసాయిరాం వృద్ధాశ్రమంలో రూ. 8 లక్షల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధులకు ఎటువంటి సమస్యలున్నా దాతల సహకారంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.