తిరుమలకు పోటెత్తిన భక్తులు

వేసవి సెలవులు, ఇంటర్, టెన్త్ ఫలితాలు రావడంతో శుక్రవారం తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శుక్రవారం ఉదయం అలిపిరి టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్