బెంగళూరు, చెన్నైల్లో పెద్దగా డిమాండ్ లేని మేక తలలు, కాళ్లకు తిరుపతిలో విపరీతమైన గిరాకీ ఉంది. దీంతో వ్యాపారులు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి ఒక్కో తల, కాలును రూ.50 చొప్పున కొనుగోలు చేసి, తిరుపతి మటన్ మార్కెట్‌లో ప్రజలకు, హోటళ్లకు రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. మిగిలిన వాటిని ఫ్రీజర్‌లో నిల్వ ఉంచి, పెద్ద ఆర్డర్లు వచ్చినప్పుడు వాటితో కలిపి అమ్ముతున్నారు. ఈ దోపిడీతో వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు.