తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల సమీపంలో బుధవారం రాత్రి సుమారు 12అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీనిని గమనించిన వేద పాఠశాల విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అధ్యాపకులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది భాస్కర్ నాయుడు కొండచిలువను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో విద్యార్థులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.