తిరుపతి ఎస్వీ జూపార్కులో గాయపడిన మకనా ఏనుగు మృతి

చిత్తూరు జిల్లా గుడ్డివానిచెరువు వద్ద తీవ్రంగా గాయపడిన మున్నా అనే మకనా ఏనుగు ఎస్వీ జూపార్కులో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. రెండు రోజుల క్రితం కుంకీ ఏనుగులు, భారీ క్రేన్ సహాయంతో మున్నాను జూపార్కుకు తరలించారు. ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో వెటర్నరీ నిపుణులు నిరంతరం చికిత్స అందించినప్పటికీ గాయాలు తీవ్రమై ప్రాణాలు నిలువలేకపోయాయి. అనంతరం పోస్ట్‌మార్టం నిర్వహించి జూపార్క్ ప్రాంగణంలోనే ఖననం చేసినట్లు క్యూరేటర్ సెల్వం తెలిపారు.

సంబంధిత పోస్ట్