తిరుమలకు కాలినడకన జాన్వీ కపూర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన 'పెద్ది' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ హీరోయిన్ జాన్వీ కపూర్ గురువారం రాత్రి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అభిమానులు ఆమెను ఆసక్తిగా పలకరించి ఫొటోలు దిగారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన జాన్వీ భక్తి భావంతో మెట్లు ఎక్కడం ఆకట్టుకుంది. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్