కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం క్షీరాభిషేకానికి విరిగిన పాలు సరఫరా కావడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గుత్తేదారుడిపై చర్యలు తీసుకోవాలని ఈవో పెంచల కిశోర్ ఆదేశించారు. ఇకపై ఆలయం తరఫునే పాలను సరఫరా చేస్తామని తెలిపారు.