తిరుమల అలిపిరి టోల్ గేట్ సమీపంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున చిరుతపులి ఒక జింకపై దాడి చేసి చంపింది. ఈ ఘటనతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రత దృష్ట్యా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.