శనివారం ఉదయం తడ సమీపంలోని శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద ఒక పరిశ్రమ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న సిబ్బంది సకాలంలో బయటకు దూకడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, బస్సు పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.