MBU వివాదం.. హైకోర్టుకు వెళ్లిన మోహన్ బాబు

తిరుచానూరులో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ నటుడు, MBU ఛాన్స్‌లర్ మోహన్ బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం MBUలో అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘ నాయకులు తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టగా, వర్సిటీ బౌన్సర్లు వారిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మోహన్ బాబు, విష్ణు, సతీశ్‌పై కేసు నమోదైంది. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్