ప్రముఖ సంగీత దర్శకుడు శివమణి, తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో టిటిడి అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 'అఖండ-2' సినిమాకు నేపథ్య సంగీతం పూర్తిచేసిన అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చానని శివమణి తెలిపారు.