సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో జాతీయ ఐక్యత దినోత్సవం

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో శుక్రవారం సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం, NSS సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ‘రాష్ట్ర ఏకతా దివస్’ సందర్భంగా జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనంతరం దేశ సమైక్యతకు సర్దార్ పటేల్ చేసిన అప్రతిహత కృషిని స్మరించారు.

సంబంధిత పోస్ట్