కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. వకుళమాత అతిథి భవనంలో ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఆయనకు బస ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు.