తిరుపతి నగరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

తిరుపతి నగరంలోని 3వ వార్డులో జనసేన పార్టీ ఇన్‌చార్జి మధు రాయల్ చింతంశెట్టి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తున్నామని, వృద్ధులు, వికలాంగులకు అండగా నిలుస్తామని మధు రాయల్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్